హైదరాబాద్‌లో ఘోరం.. హాస్టల్‌లో వంటమనిషి దారుణ హత్య!

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గచ్చిబౌలి అంజయ్య నగర్‌లోని హరిహర మెన్‌ హాస్టల్‌లో అర్ధరాత్రి దారుణం జరిగింది. హాస్టల్‌లో వంటమనిషిగా పనిచేస్తున్న శశిధర్‌ను, తోటి సిబ్బంది ప్రమోద్ కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. గొడవ కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు పరారీలో ఉండగా, రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.