యమునా ఎక్స్ప్రెస్వేపై బస్సు దగ్ధం తొమ్మిది మంది దుర్మరణం

రిపోర్టర్: నరేష్ స్థలం: నోయిడా

యమునా ఎక్స్ప్రెస్వేపై ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. బీహార్కు చెందిన స్లీపర్ బస్సు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకోవడంతో తొమ్మిది మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మహోబా వెళ్తుండగా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో బుధవారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కిటికీల ద్వారా దూకి కొందరు ప్రాణాలు కాపాడుకోగా, దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.