హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభం కానున్న ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ బడా గణేశుని నిమజ్జన వేడుకలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. శుక్రవారం ఉదయం సరిగ్గా ఆరు గంటలకు మహా గణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటలలోపే హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా లాంగ్ బూమ్ మెకానికల్ క్రేన్‌ను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.