మిర్జాపూర్ మూవీపై ప్రశంసల జల్లు కురిపించిన స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: India
ప్రముఖ ఓటీటీ సిరీస్ 'మిర్జాపూర్' ఇప్పుడు వెండితెరపై సందడి చేస్తోంది. ఈ చిత్రాన్ని చూసిన స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్, ఇది ఒక 'సాలిడ్, కడక్, మసాలేదార్' రైడ్ అని కొనియాడారు. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ నటనతో ఈ సినిమా అద్భుతంగా ఉందని, సిరీస్ చూడని వారు కూడా ఈ చిత్రాన్ని తప్పక ఆస్వాదిస్తారని ఆయన సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సెప్టెంబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.