పంజాబ్ యూనివర్సిటీలో ఘర్షణల కలకలం: సోషల్ మీడియాలో రెచ్చగొట్టిన ఇద్దరు అరెస్ట్
రిపోర్టర్: నరేష్
స్థలం: Patiala
పంజాబ్లోని పటియాలాలో ఉన్న చిత్రాకార యూనివర్సిటీలో చెలరేగిన నిరసనల ఘర్షణలకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. విశ్వవిద్యాలయ క్యాంపస్లో దెయ్యం తిరుగుతోందంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి, విద్యార్థులను రెచ్చగొట్టిన హిమాన్షు, ఆర్యన్లను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ సుఖ్దేవ్ సింగ్ వెల్లడించారు. ఈ అల్లర్లలో పాల్గొన్న మరో పది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.