ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం తగదు: అధికారులను హెచ్చరించిన ఎస్ఈసీ పునేఠా
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, అధికారులు పూర్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా స్పష్టం చేశారు. అమరావతిలో కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రజలు తమ ఓటుహక్కును స్వేచ్ఛగా, ప్రశాంతంగా వినియోగించుకునేలా తగిన వాతావరణం కల్పించాలని ఆదేశించారు. అక్రమాలపై అందిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని, అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఎస్ఈసీ పునేఠా తేల్చిచెప్పారు.