నాగులవంచ ప్రభుత్వ లెక్చరర్ బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు
రిపోర్టర్: హరి
స్థలం: ఖమ్మం
ఖమ్మం జిల్లా నాగులవంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఎం.వీరాంజనేయులును కందుకూరు కళాశాలకు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ఉత్తర్వులు జారీ చేశారని అధికారులు తెలిపారు. విద్యా బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమవడం, విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో పాటు సిలబస్ పూర్తి చేయకపోవడంపై ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో విచారణ జరిపి ఉద్రిక్తతను చల్లార్చేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.