అక్టోబర్ ఒకటి నుండి అమల్లోకి వచ్చిన కీలక ఆర్థిక నిబంధనలు
రిపోర్టర్: సురేష్
స్థలం: తెలంగాణ
అక్టోబర్ ఒకటి నుండి సామాన్య ప్రజల దైనందిన ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపే పలు కీలక నిబంధనలు అమల్లోకి వచ్చాయని ఆర్థిక నిపుణులు తెలిపారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పొందే వినియోగదారులకు ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ తప్పనిసరి చేశామని, ఎస్బీఐ శాలరీ ఖాతాదారుల ఉచిత ఏటీఎం లావాదేవీలను ఐదుకి కుదించామని వెల్లడించారు. అలాగే బల్క్ డిపాజిట్ల వడ్డీ రేట్ల ప్రచురణ, ఎన్పీఎస్ ఆన్‌బోర్డింగ్ ఛార్జీలు, యూపీఐ మార్పులు కూడా నేటి నుంచి అమల్లోకి రానున్నాయని అధికారులు స్పష్టం చేశారు.