బిగ్బాస్లోకి వైల్డ్ కార్డు ఎంట్రీగా సీరియల్ నటుడు శివకుమార్

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

బిగ్బాస్ హౌస్లోకి మొదటి వైల్డ్ కార్డు కంటెస్టెంట్గా ప్రముఖ సీరియల్ నటుడు శివకుమార్ ఎంట్రీ ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. కన్నడ నటుడైన శివకుమార్ పలు సీరియల్స్తో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. మౌనరాగం, ఇంటికి దీపం ఇల్లాలు వంటి ధారావాహికలతో మంచి ఫేమ్ సంపాదించిన ఆయన, త్వరలో ప్రియాంక జైన్ను వివాహం చేసుకోనున్నారు. ఈ సీజన్లో ఆయన ఎలాంటి ఆట ప్రదర్శిస్తారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.