సచిన్ రికార్డును బద్దలు కొట్టిన జింబాబ్వే ఆటగాడు బ్రెండన్ టేలర్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: World

జింబాబ్వే వెటరన్ బ్యాటర్ బ్రెండన్ టేలర్ వన్డే క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో బరిలోకి దిగడం ద్వారా ఆయన ఈ ఘనత సాధించాడు. 2004లో అరంగేట్రం చేసిన టేలర్, 22 సంవత్సరాల 146 రోజుల కెరీర్‌తో అత్యధిక కాలం వన్డేలు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు సచిన్ 22 సంవత్సరాల 91 రోజుల రికార్డుపై ఉండేవాడు.