తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా విమానాశ్రయాలు నిర్మించాలన్న సీఎం రేవంత్

రిపోర్టర్: మహేష్ స్థలం: Hyderabad

ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు మరియు ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలను రాష్ట్ర సంస్కృతి, చారిత్రక వైభవానికి ప్రతీకలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం, పిల్లలమర్రి వంటి చారిత్రక చిహ్నాలు ప్రతిబింబించేలా ఈ నిర్మాణాల రూపకల్పన ఉండాలని ఆయన స్పష్టం చేశారు.