వినాయక నిమజ్జనం వేళ హైదరాబాద్‌లో పాఠశాలలకు సాధారణ సెలవు ప్రకటించిన ప్రభుత్వం
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా జరిగే వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శోభాయాత్రలు, నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ఈ నెల 25 శుక్రవారం రోజున సాధారణ సెలవును ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు ఈ సెలవు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.