నెల్లూరులో రాత్రి వేళల్లో ప్రత్యేక ఎస్టీఎఫ్ బృందాలతో కట్టుదిట్టమైన నిఘా
రిపోర్టర్: సునీల్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీసు యంత్రాంగం నగర, గ్రామీణ ప్రాంతాలలో రాత్రి వేళల్లో అసాంఘిక, చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు ప్రత్యేక ఎస్టీఎఫ్ బృందాలతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్తో పాటు అనుమానాస్పద వాహనాలు, లాడ్జీలు, గెస్ట్హౌస్లపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ శాంతిభద్రతలను పటిష్టంగా పర్యవేక్షిస్తున్నారు.