దళితులంటే బీఆర్ఎస్కు చిన్నచూపు.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆగ్రహం

రిపోర్టర్: kasanivenkatesh స్థలం: నేలకొండపల్లి

దళితులంటే బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి చిన్నచూపేనని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్రస్థాయిలో విమర్శించారు. శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ, దళిత వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులను అవమానించే చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.

తెలంగాణ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని మండలి ఛైర్మన్కు విన్నవించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు.