ఆరోగ్య నిపుణుల హెచ్చరిక: సూర్యరశ్మి ప్రయోజనాలపై డాక్టర్ సుధీర్ కుమార్ వెల్లడి
రిపోర్టర్: అశోక్
స్థలం: Hyderabad
సూర్యరశ్మి సమయాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని ప్రముఖ నూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ స్పష్టం చేశారు. ఉదయం పూట ఎండ శరీరం అంతర్గత గడియారాన్ని క్రమబద్ధం చేస్తుందని, విటమిన్ డి కోసం మధ్యాహ్నం ఎండ అవసరమని ఆయన తెలిపారు. ఉదయం ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఎండలో ఉండాలని, అలాగే మధ్యాహ్నం సమయంలో పదిహేను నిమిషాలు ఎండ తగలాలని ఆయన సూచించారు. అయితే చర్మంపై తీవ్ర ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ కుమార్ హెచ్చరించారు.