ఓటర్ల విచారణపై సీఈవో వివేక్‌యాదవ్ కీలక ఆదేశాలు: ఆఫీసులకు రావొద్దని స్పష్టం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమరావతి
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో నోటీసులు అందుకున్నవారు విచారణ కోసం కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్ స్పష్టం చేశారు. బూత్ స్థాయి అధికారులే నేరుగా ఓటర్ల ఇళ్లకు వచ్చి పత్రాలు సేకరించి నెట్లో అప్లోడ్ చేస్తారని ఆయన తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఈ మేరకు పలు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు.