లైంగిక నేరస్థులపై ఏపీ పోలీసుల ప్రత్యేక నిఘా.
రిపోర్టర్: శివ
స్థలం: ఆంధ్రప్రదేశ్
మహిళలు, చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడుతున్న వారిపై ఏపీ పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చాక 3,207 మందిపై సెక్సువల్ అఫెండర్ షీట్లు తెరిచారు. జియోట్యాగింగ్, ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలతో నిందితుల కదలికలను నిరంతరం ట్రాక్ చేస్తున్నారు. డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ఈ విధానం నేరాల నియంత్రణకు దోహదపడుతుందని స్పష్టం చేశారు.