జావా సముద్రంలో 241 మందితో ప్రయాణికుల నౌక గల్లంతు.

రిపోర్టర్: భాస్కర్ స్థలం: World

ఇండోనేషియాలోని జావా సముద్రంలో 241 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక అకస్మాత్తుగా గల్లంతైంది. ఈస్ట్ జావా నుంచి సౌత్ కాలిమంటన్ వెళ్తుండగా ప్రతికూల వాతావరణం కారణంగా నౌకతో సంబంధాలు తెగిపోయాయి. అధికారులు వెంటనే అప్రమత్తమై భారీ ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నౌక ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.