వంద శాతం ఇథనాల్ ఇంధన వినియోగానికి కేంద్రం ఆమోదమన్న నితిన్ గడ్కరీ

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

దేశంలో వంద శాతం ఇథనాల్ను ఇంధనంగా ఉపయోగించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలకు చట్టపరమైన ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్పై ఆధారపడటాన్ని తగ్గించడంలో భాగంగా ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లకు మార్గం సుగమమైందని ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో వాహనాల తయారీ సంస్థలు వంద శాతం ఇథనాల్తో నడిచే కార్లను మార్కెట్లోకి తీసుకురానున్నాయని, సామాన్య ప్రజలకు ఇంధన ఖర్చు తగ్గడంతో పాటు కాలుష్యం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.