టీడీపీ కార్యాలయం దాడి కేసులో నిందితులపై రౌడీషీట్లు

రిపోర్టర్: హరి స్థలం: విజయవాడ

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై గతంలో జరిగిన దాడి కేసుకు సంబంధించి విజయవాడ సీపీ రాజశేఖరబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ రఘురాం, దేవినేని అవినాశ్ సహా మొత్తం 51 మందిపై రౌడీషీట్లు తెరవాలని ఆయన తాజాగా అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు.