మందమర్రి టూ చందమామ: నవంబర్ 13న థియేటర్లలోకి చంద్రయాన్ చిత్రం
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల సమర్పణలో ప్రవీణ్ మొలక నిర్మించిన వైవిధ్యమైన చిత్రం చంద్రయాన్ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్ర యూనిట్ తెలిపింది. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ హిలేరియస్ అడ్వెంచర్ కామెడీ సినిమాలో నలుగురు యువకులు సొంతంగా రాకెట్ తయారు చేసి చంద్రమండలానికి వెళ్లాలని సాహసించడం ప్రధానాంశం. ఈ చిత్రం కుటుంబ సమేతంగా ప్రేక్షకులను నవ్విస్తుందని చిత్ర సమర్పకులు వేణు ఊడుగుల పేర్కొన్నారు.