కావలిలో గణేష్ ఉత్సవాల వేలంపాటలో రికార్డు సృష్టించిన లడ్డూ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: కావలి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. కావలి గ్రామదేవత కళుగోళమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద నిర్వహించిన లడ్డూ వేలంపాటలో ఓ లడ్డూ అత్యధికంగా రూ.7.2 లక్షలు పలికింది. గత పదకొండు రోజులుగా పూజలందుకున్న యాభై రెండు కిలోల లడ్డూను స్థానిక స్థిరాస్తి వ్యాపారి వేముల చెన్నకేశవులు నాయుడు దక్కించుకున్నారు. అనంతరం ఉట్టి మహోత్సవం, నిమజ్జన ఊరేగింపు అట్టహాసంగా సాగాయి.