చిరు వ్యాపారులకు అండగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్లు పట్టణంలో చిరు వ్యాపారుల సంక్షేమం కోసం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు వ్యాపారులు తమ పెండింగ్ కోర్టు కేసులను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే స్థానిక సమస్యలు పరిష్కారమవుతున్నాయని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.