పుణెలో ఘనంగా మరాఠీ నటుల డోల్ తాషా ప్రదర్శన
రిపోర్టర్: అశోక్
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్రలోని పుణెలో గణేశ్ ఉత్సవాల సందర్భంగా మరాఠీ నటులు, కళాకారులు ఏర్పాటు చేసిన కలావంత్ డోల్ తాషా పథక్ బృందం 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. పదేళ్ల క్రితం కేవలం 10-15 మందితో ప్రారంభమైన ఈ బృందంలో ప్రస్తుతం వివిధ కళారంగాలకు చెందిన 350 మంది సభ్యులు ఉన్నారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఈ బృందం చేసే డోల్, తాషా వాయిద్యాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.