ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 892 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
రిపోర్టర్: హరి
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగార్థులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 892 ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో గ్రూప్-1 తో పాటు ఏఈ, ఏఎస్ఓ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వంటి కీలక పోస్టులు ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం వయోపరిమితి సడలించడంతో నిరుద్యోగ యువతకు ఇది పెద్ద ఊరటనిచ్చింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.