స్పీకర్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్

రిపోర్టర్: kasanivenkatesh స్థలం: నేలకొండపల్లి

స్పీకర్ ను ఉద్దేశించి తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ స్పష్టం చేశారు. రాజకీయ కారణాలతో తనపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.

తాను అనని మాటలను తనకు ఆపాదించడం సరికాదని, స్పీకర్ పట్ల తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. ఒకవేళ తన వ్యాఖ్యలు స్పీకర్ ను ఉద్దేశించినట్లు భావిస్తే వాటిని ఉపసంహరించుకుంటున్నానని, ఈ విషయంలో విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.