పేదలకు ఇళ్ల స్థలాలపై పూర్తి హక్కులు కల్పిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
రిపోర్టర్: నరేష్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలో నిర్వహించిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని 28,445 కుటుంబాలకు ఇళ్ల స్థలాలపై సర్వ హక్కులు కల్పిస్తూ పట్టాలు అందజేశారు. కూడు, గూడు, గుడ్డ తమ ప్రభుత్వ నినాదమని, ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ ధర ప్రకారం ఈ భూమి విలువ రూ.8,874 కోట్లు ఉంటుందని, విలువైన భూములను అమ్ముకోకుండా భరోజాగా భావించాలని లబ్ధిదారులకు సూచించారు.