ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలో వైఫల్యం: ఛార్జింగ్ కేంద్రాల్ లో నిలిచిపోతున్న రాకపోకలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

నగరంలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ సరిగా లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని అధికారులు తెలిపారు. ఛార్జింగ్ కేంద్రాల వద్ద బస్సులు గంటల తరబడి నిలిచిపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రెట్రోఫిట్ విధానంపై భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.