ఈసీ వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలి ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఈసీ వైఖరికి నిరసనగా ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. సర్ ప్రక్రియలో తలెత్తిన అనుమానాలపై ఈసీ స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు.