కర్నూలు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన: దెబ్బతిన్న పంటల పరిశీలన
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కర్నూలు
ఎల్నినో ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న పంటలను అంచనా వేయడానికి కేంద్ర బృందం కర్నూలు జిల్లాలో పర్యటించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఖరీఫ్ సీజన్ లో సాగైన ఆముదం, కంది, టమాటా పంటలను బృందం పరిశీలించింది. పెట్టుబడి కూడా చేతికందక రైతులు పడుతున్న కష్టాలను ముఖాముఖిలో వివరించారు. గ్రామాల్ లో తాగునీరు లేక, పశువులకు గ్రాసం కరువై వలసపోతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే ఆదుకోవాలని కోరారు.