అల్లూరి జిల్లాలో గంజాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

రిపోర్టర్: కృష్ణ స్థలం: అల్లూరి సీతారామరాజు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పెదబలు మండలం సీతగుంట జంక్షన్ వద్ద రూ.కోట్ల విలువైన 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్ట్ చేశారు. అలాగే స్థానిక ఎన్నికల భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, డ్రోన్ల ద్వారా గంజాయి సాగు నిర్మూలన సర్వే వంటి పలు కీలక చర్యలపై ఎస్ఐలు, సీఐలు, డీఎస్పీలు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ కఠిన హెచ్చరికలు జారీ చేశారు.