రైలు కోచ్లో ప్రయాణికుల ముందే వ్యక్తి మూత్ర విసర్జన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

రద్దీగా ఉండే రైలు కోచ్లో ప్రయాణికులందరూ చూస్తుండగా ఓ వ్యక్తి బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై రైల్వే సేవా స్పందించినట్లు అధికారులు తెలిపారు. కోచ్లో ప్రయాణికుల రద్దీ మరియు భద్రతా లోపాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తి వివరాలు అందిస్తే తగిన విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ స్పష్టం చేసింది.