రైతుల భూములపై సెక్షన్ 22-ఏ నిరసిస్తూ బీజేపీ మహా ధర్నా

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

సికింద్రాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. రైతుల భూములను భూభారతిలో సెక్షన్ 22-ఏ కింద చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎన్. రామచంద్ర రావు పాల్గొని ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. రైతుల హక్కులను కాలరాసే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.