మంచిర్యాల జిల్లాలో విషాదం: అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
రిపోర్టర్: రాజేష్
స్థలం: మంచిర్యాల
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడకు చెందిన బదావత్ రాజునాయక్ అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాజునాయక్ కు రెండు ఆటోలు ఉండగా, ఒక ఆటోకు యాక్సిడెంట్ కావడంతో అప్పు చేసి బాగు చేయించుకున్నాడు. గిరాకీలు రాక, అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపం చెంది గోదావరి ఒడ్డుకు వెళ్లి పురుగులమందు తాగాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.