స్విగ్గీ ఇన్ స్టామార్ట్ వివాదం: గడువు ముగిసిన వస్తువులపై సమగ్ర విచారణ
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
రాష్ట్రంలో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయాలపై సమగ్ర విచారణ జరపాలని, డెలివరీ కార్మికులపై యాజమాన్యాలు చేస్తున్న ప్రతీకార చర్యలను అరికట్టాలని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ డిమాండ్ చేశారు. హస్తినాపూర్లోని స్విగ్గీ ఇన్స్టామార్ట్ స్టోర్లో ఫుడ్ సేఫ్టీ అధికారిని అడ్డుకోవడంపై విచారణ జరపాలని, కార్మికుల రైడర్ ఐడీలను బ్లాక్ చేయడం వంటి చర్యలను వెంటనే విరమించుకోవాలని గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.