కాకినాడ జిల్లాలో నిలిచిపోయిన SMC ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కాకినాడ రూరల్

కాకినాడ జిల్లాలో వివిధ కారణాలతో వాయిదా పడిన ఆరు పాఠశాలల పాఠశాల నిర్వహణ కమిటీ ఎన్నికలను అక్టోబరు మూడో తేదీన నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. గొల్లప్రోలు, కాకినాడ రూరల్, కరప, కిర్లంపూడి మరియు కోటనందూరు మండలాల్లోని సంబంధిత పాఠశాలల్లో ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.