స్నాప్‌డ్రాగన్ సౌండ్ ఎలైట్ చిప్‌ను విడుదల చేసిన క్వాల్‌కామ్ టెక్నాలజీస్
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లో జరిగిన స్నాప్‌డ్రాగన్ సమ్మిట్ 2026 వేదికగా క్వాల్‌కామ్ టెక్నాలజీస్ సంస్థ సరికొత్త స్నాప్‌డ్రాగన్ సౌండ్ ఎలైట్ జెన్ 2 చిప్‌సెట్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్ వంటి ఆడియో వేరబుల్స్ కోసం దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. రెట్టింపు ఏఐ సామర్థ్యంతో పాటు మెరుగైన సౌండ్ క్వాలిటీ, వాయిస్ రికగ్నిషన్ ఫీచర్లు ఇందులో ఉన్నాయని కంపెనీ ప్రతినిధి జియాద్ అస్ఘర్ తెలిపారు. స్క్రీన్‌లతో పనిలేకుండా వాయిస్ ద్వారానే నేరుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకునేలా ఈ ప్లాట్‌ఫామ్‌ను తీర్చిదిద్దినట్లు ఆయన పేర్కొన్నారు.