శ్రీకాకుళంలో వర్షాలు వరదలకు నీటమునిగిన పన్నెండు వేల హెక్టార్ల వరి
రిపోర్టర్: కిరణ్
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా పన్నెండు వేల హెక్టార్లలో వరి పంట నీటమునిగినట్లు అధికారిక అంచనాలు స్పష్టం చేశాయి. ఉద్యాన పంటలతో పాటు తీర ప్రాంతాల్లో సముద్ర కోత తీవ్రమైందని, పెదగనగళ్లపేట వద్ద వందలాది చెట్లు కొట్టుకుపోయాయని అధికారులు వెల్లడించారు.