భారత నిర్ణయాలపై విదేశీ వ్యాపారవేత్తల పెత్తనాన్ని సహించబోమని అసదుద్దీన్ ఒవైసీ తేల్చిచెప్పారు

రిపోర్టర్: వెంకట్ స్థలం: Hyderabad

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాజకీయంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ భారతదేశ విధానాలపై విదేశీ వ్యాపారవేత్తల పెత్తనాన్ని అంగీకరించబోమని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. స్టార్లింక్ అధినేత ఎలాన్ మస్క్ భారత ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. మోదీని విమర్శించే హక్కు తనకు ఉందని అయితే దేశ సార్వభౌమాధికారాన్ని విదేశీయులు శాసించడాన్ని సహించబోమని ఆయన ఘాటుగా పేర్కొన్నారు.