అర్జీల రిమార్క్స్ దాచిపెడుతున్న అధికారుల వైఖరి

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

తిరుపతి జిల్లా చిట్వేలు మండలంలో పదిహేను రోజుల క్రితం సమర్పించిన అర్జీలపై చేసిన రిమార్క్స్ చూపించాలని బుంగటవల రాజశేఖర్ ఎంపీడీవోను కోరారు. అర్జీలపై అధికారుల స్పందన ఏమిటని ప్రశ్నించగా స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని ఆయన తెలిపారు. అర్జీలపై తీసుకున్న చర్యల వివరాలు చూపించకపోవడంపై బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.