సంక్రాంతి బరిలో మెగాస్టార్ కాకా చిత్రం విడుదలంటూ చిరంజీవి ప్రకటన
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కాకా సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోందని నటుడు చిరంజీవి వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించి మొదటి భాగంతో పాటు రెండో భాగంలో ముప్పై శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలిపారు. సంగీత దర్శకుడు తమన్ ఇప్పటికే రీ-రికార్డింగ్ పనులు వేగవంతం చేశారని, సంక్రాంతి కానుకగా జనవరి పదమూడున సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు చిరంజీవి స్పష్టం చేశారు.