నేరరహిత వరంగల్ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టిన వరంగల్ పోలీస్ కమిషనరేట్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హన్మకొండ

నేరరహిత వరంగల్ మరియు డ్రగ్స్ రహిత సమాజమే తమ ప్రధాన లక్ష్యమని వరంగల్ సిపి ఎన్.శ్వేత వెల్లడించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా అలాగే అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆమె తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున పోలీస్ శాఖ విస్తృత తనిఖీలు నిర్వహించి, భద్రతాపరమైన ముందస్తు చర్యలను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు పోలీస్ వర్గాలు అధికారికంగా పేర్కొన్నాయి.