రాజానగరం జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేనకు భారీ షాక్: భార్య ఓటమితో బలరామకృష్ణకు ఎదురుదెబ్బ
రిపోర్టర్: మహేష్
స్థలం: తూర్పుగోదావరి జిల్లా
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో వెలువడిన జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు జనసేన పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చాయి. సీతానగరం జడ్పీటీసీ స్థానం నుంచి జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భార్య వెంకటలక్ష్మి పోటీ చేసి ఓటమి చవిచూశారని అధికారులు తెలిపారు. వైసీపీ అభ్యర్థి కరుటూరి శ్రీహరిబాబు ఆమెపై ఘన విజయం సాధించడంతో ఈ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయని విశ్లేషకులు స్పష్టం చేశారు.