డీజే టిల్లు రేంజ్ లో అనుమాన పక్షి సినిమా ఉంటుందని హీరో రాగ్ మయూర్ ధీమా

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

డీజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న కామెడీ థ్రిల్లర్ సినిమా అనుమాన పక్షి ఈ నెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విలేకరులతో మాట్లాడిన రాగ్ మయూర్, విమల్ కృష్ణ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని తెలిపారు. వినోదం, మిస్టరీ, హారర్ మరియు థ్రిల్లర్ అంశాలతో సాగే ఈ చిత్రం డీజే టిల్లు మరియు జాతిరత్నాలు లాంటి భారీ విజయాన్ని సాధించి మ్యాజిక్ రిపీట్ చేస్తుందని ఆయన పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.