'తాట తీస్తా': కార్యకర్తలపై తెలుగు స్క్రైబ్ వీరంగం
రిపోర్టర్: సునీల్
స్థలం: Andhra Pradesh
నాపైనే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారా అంటూ కార్యకర్తలపై తెలుగు స్క్రైబ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వేయించలేరు, కార్యక్రమాలకు ప్రజలను తీసుకురాలేరు కానీ తనపై ఫిర్యాదులు చేస్తారా అని మండిపడ్డారు. తనతో దిగిన ఫోటోను స్టేటస్ పెట్టుకుంటే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తారా అంటూ హెచ్చరించారు. పార్టీలో క్రమశిక్షణ పాటించకపోతే ఊరుకునేది లేదని, తాట తీస్తానంటూ తెలుగు స్క్రైబ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాలలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.