బీహార్లో ప్రభుత్వ ఉద్యోగుల ఇంట్లో విజిలెన్స్ అధికారుల సోదాలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: పాట్నా

బీహార్లో విజిలెన్స్ అధికారులు చేపట్టిన సోదాల్లో ప్రభుత్వ ఉద్యోగులైన అదనపు జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ దివాకర్, సబ్ రిజిస్టర్ కుమారి స్వీటీ దంపతుల ఇళ్ల నుంచి కోటి రూపాయల నగదు, ఆభరణాలు, ఖరీదైన వాచీలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పాట్నా, బెగుసరాయిలలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ తనిఖీల్లో భారీగా ఆస్తుల డాక్యుమెంట్లు, నూతన ప్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను గుర్తించి సీజ్ చేసినట్లు విజిలెన్స్ శాఖ స్పష్టం చేసింది.