'హాని జరిగితే బాధ్యత కంపెనీలదే': ఏఐ భద్రతపై మార్క్ జుకర్‌బర్గ్ హెచ్చరిక

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వేగంగా పెరుగుతున్న వేళ, దాని బాధ్యత, భద్రతపై మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ కీలక ప్రకటన చేశారు. AI అభివృద్ధిలో అలైన్‌మెంట్, నమ్మకం, జవాబ్దారీతనం అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. AI మోడల్స్ వల్ల సమాజానికి లేదా వ్యక్తులకు హాని జరిగితే తయారీ కంపెనీలే చట్టపరమైన, ఆర్థిక పరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠినమైన సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించడం తప్పనిసరి అని జుకర్‌బర్గ్ హెచ్చరించారు.