పాత్రికేయుల ఆక్రోశం తీర్చే వేదికగా అఖిల భారత సదస్సు
రిపోర్టర్: santhoshkumar
స్థలం: గాజువాక
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం వై.వి.ఎస్. మూర్తి ఆడిటోరియంలో భారతీయ శ్రమజీవి పత్రకార్ సంఘ్, నవ్యంధ్ర జర్నలిస్ట్స్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అఖిల భారత పాత్రికేయ సదస్సు ఘనంగా జరిగింది. సమాజ పురోగతిలో పాత్రికేయుల పాత్రపై చర్చించిన ఈ సదస్సుకు ఎంపీ శ్రీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికగా సీనియర్ జర్నలిస్ట్ ఎం.ఎస్.ఆర్. ప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సూరంపూడి వీరభద్రరావు, జి.వి.ఎల్. నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.