గంధపు చెట్ల పెట్టుబడి మోసం: రియల్ ఎస్టేట్ సంస్థకు భారీ జరిమానా
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
తెలుపు గంధపు చెట్ల సాగు పేరుతో రూ. 17.5 లక్షలు పెట్టుబడి పెట్టించుకుని, లీజు ఒప్పందాన్ని ఉల్లంఘించిన స్క్వేర్స్ అండ్ యార్డ్స్ ఇన్ఫ్రా సంస్థకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. బాధితుడికి ప్రతి నెలా రూ. 60,000 చెల్లించాలని, మానసిక వేదనకు రూ. 25,000 మరియు కోర్టు ఖర్చుల నిమిత్తం రూ. 5,000 అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.