రైతుల భూ హక్కులకు భరోసా కల్పిస్తామన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఓబులవారిపల్లి

ఓబులవారిపల్లి మండలం రాళ్లచెరువుపల్లి గ్రామంలో మీ భూమి–మీ హక్కు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి అధికారులతో కలిసి రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేశారు. భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.